షాపింగ్ మాల్స్ లో మనం గమనించినట్లయితే ఫుడ్ కోర్ట్ వంటివి టాప్ ఫ్లోర్ లో ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్ టాప్ ఫ్లోర్ లోనే ఉంటుంది, ఎందుకు ఇలా ఫుడ్ కోర్ట్స్ కింద ఉండకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీని వెనుక కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా షాపింగ్ మాల్స్ లో అందరూ షాపింగ్ చేసి క్యాలరీలను కరిగించుకుంటూ ఉంటారు. ఆకలి వేస్తుంది. పైన పెట్టడం వలన తినాలన్న భావన కలుగుతుంది. ఆకలి వేస్తుంది.
కాబట్టి కచ్చితంగా వచ్చిన వాళ్ళు ఆహారాన్ని తిని వెళ్తారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే ఫుడ్ కోర్ట్ నడపాలంటే ఎక్కువ స్పేస్ ఉండాలి..? పైగా అది ఎవరికీ డిస్ట్రబ్ అవ్వకూడదు. పైన అయితే దేనికీ అడ్డంకి అవ్వదు. కేవలం ఫుడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఇబ్బంది ఉండదు.
అలాగే మనుషులు తత్వం ప్రకారం కింద ఉంటే ఎవరు కూడా షాపింగ్ మాల్ ని చూడకుండా కేవలం అక్కడ తిని వెళ్లిపోతూ ఉంటారు. షాపింగ్ చేయరన్న ఉద్దేశంతో ఇలా పైన ఫుడ్ కోర్ట్ ని ఉంచడం జరిగింది. అలాగే ఫుడ్ కోర్ట్ పైన ఉండడం వలన వచ్చిన వాళ్ళందరూ కూడా షాపింగ్ చేయడానికి ప్రోత్సహించినట్లుగా ఇలా టాప్ ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ని పెట్టారు.