ఒక్కో మనిషి స్వభావం ఒక్కోలా ఉంటుంది. కొంతమంది అసలు ఏ ఒక్క మాటని కూడా దాచుకోలేరు. వెంటనే వాటిని నలుగురితో పంచేసుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం నలుగురు మధ్య తిరుగుతున్నా మనసులో మాట బయటకు రాదు. అక్కడే ఉండిపోతుంది. ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే ఎందుకు మనసులో మాటని కొంతమంది బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు..? సైకాలజీ ఏం చెప్తోంది..? ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మనసులో మాటని బయటకు చెప్పరు అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా వాళ్ల మీద వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళు ఇతరులతో ఏ విషయాన్ని చెప్పడానికి ఇష్టపడరు. వారిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కనుక నలుగురితో పంచుకోవడానికి ఆసక్తి చూపించరు.
కొంతమంది జీవితంలో ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. ఒంటరిగా ఉంటేనే వాళ్ళకి నచ్చుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఎవరికీ వారి మనసులో మాటను చెప్పరట. ఒంటరితనం ఇష్టపడిన వాళ్ళు లోపలే వారి మాటలని, ఆలోచనలని దాచేసుకుంటారు. కొంతమంది వారి బాధను పంచుకోవడానికి నామోషీగా భావిస్తారు. మనసులో మాటని బయటికి చెప్పరు. మనసులోనే దాచుకుంటారు.
కొందరికి జీవితం మీద నిరాశ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా బాధలని బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎంత బాధ ఉన్నా దాచేసుకుంటారు. కొందరికి అహంకారం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇతరులతో ఏ విషయాన్ని పంచుకోరు. చులకన అయిపోతామన్న భావనతో వాళ్ళు చెప్పరట. ఎవరైతే జీవితంలో ఇతరులకి గౌరవం ఇవ్వరో అలాంటి వాళ్ళు కూడా వారి మనసులో మాటను బయటకు చెప్పకుండా లో లోపలే ఉంచుకుంటారు. అలాగే కొంతమందికి బాధలు పంచుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు కూడా వారి మనసులో మాటను బయటకు చెప్పారని సైకాలజీ చెప్తోంది.