హైదరాబాద్ లోని బంజారాహిల్స్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన చికిత్స అందిస్తున్నట్టు ఆసుపత్రి ఛైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. AMPICON 2024 జాతీయ సదస్సు సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. బసవతారకం ఇండొ అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ ఆధ్వర్యంలో AMPICON 2024 జాతీయ సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. మా ఆస్పత్రి లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్యాన్సర్ చికిత్సలు అందజేస్తున్నామని తెలిపారు.
మెడికల్ ఫిజిక్స్.. క్యాన్సర్ నిర్ధారణకు అత్యంత కీలకమైన పాత్ర అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రేడియేషన్ ఫీజిస్ట్స్ ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. రెండు రోజుల పాటు అనేక విషయాలపై అధ్యయనం చేస్తారని ఆశిస్తున్నాం. క్యాన్సర్ స్క్రీనింగ్ లో ముఖ్యంగా రేడియేషన్ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నెంబర్ వన్ మెరుగైన చికిత్స అందిస్తుందని తెలిపారు.