రోజురోజుకు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు దిగజారుతోంది. తెలంగాణలో డబ్బును దోచుకొని ఏఐసీసీకి పంపిస్తోంది. తెలంగాణను బంగారు బాతులా కాంగ్రెస్ అధిష్టానం ఉపయోగించుకుంటుంది అని ఎమ్మెల్యే కె పి వివేకానంద అన్నారు. హర్యానా ఎన్నికలకు తెలంగాణ నుండి డబ్బులు పంపించారు. మహారాష్ట్రలో జరిగే ఎన్నికలకు తెలంగాణ నుండి డబ్బులు వెళ్తున్నాయి. బిల్డర్లను, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి తన ఇంటి నుండే కార్యకలాపాలను నడిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే ప్రాజెక్టుల అంచనాలు తయారు అవుతున్నాయి. డబ్బులు వచ్చే వాటిపైన రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హైడ్రా పేరుతో బిల్డర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ దేశంలో ఎక్కడ పోటీ చేసినా తెలంగాణ నుండి డబ్బులు పంపిస్తున్నారు. సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు జరిగితే ఏజెన్సీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సుంకిశాల ప్రాజెక్టు ఏజెన్సీని ఎందుకు ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి చేసే అవినీతిని బయటపెడతాం అని ఎమ్మెల్యే వివేకానంద తెలిపారు.