డీఎస్సీ పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ అసెంబ్లీలో లోకేష్ మాట్లాడుతూ… NDA ప్రభుత్వం తొలి సంతకం మెగా డీఎస్సీ పై సంతకం చేసామని.. 16, 300 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ముందుగా టెట్ నిర్వహించామన్నారు. సుమారుగా 595 ఖాళీలు ఇంకా ఉన్నాయని చెప్పారు. రిటైర్మెంట్ వయసు పై అధికారులతో, సీఎం రివ్యూలో చర్చించి నిర్ణయిస్తామని వెల్లడించారు.
1998 డీఎస్సీ అభ్యర్ధుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం నిర్ణయిస్తామన్నారు. ఎటువంటి పిటిషన్లు పడకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… 2014-19 లో గత టీడీపీ పాలనలో 3038 కోట్లు ఖర్చుపెట్టి 40 పనులు పూర్తి చేసామని.. 2019-24 వైసీపీ పాలనలో కేవలం 760 కోట్లు ఖర్చుపెట్టి 5 శాతం పనులు మాత్రమే చేశారన్నారు. పట్టిసీమ, పురుషోత్తమ పట్నం, చింతలపూడి ఎత్తిపోతల పథకాల పై తమ అనుచరులతో ఎన్జీటీ లో కేసులు వేయించిందని వైసిపి పై ఆగ్రహించారు మంత్రి నిమ్మల రామానాయుడు.