ఏపీ శాసన మండలిలో బొత్స-అచ్చెన్నాయుడి మధ్య వాగ్వాదం

-

విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కేసులపై శాసన మండలిలో ఇవాళ స్వల్ప వివాదం చోటు చేసుకుంది. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందంటూ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పి కొట్టారు. ప్రభుత్వం తరపున ఇంకా పర్యవేక్షణ లోపం ఉందని బొత్స ఆరోపించారు. మృతుల విషయంలో ఇంకా స్పష్టత లేదన్నారు బొత్స సత్యనారాయణ. 

దీంతో మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. గత ఐదేళ్లలో వాటర్ ట్యాంక్ లలో పిడికెడు బ్లీచింగ్ కూడా వేసిన సందర్భాలు లేవు అన్నారు. పంచాయతీలకు వైసీపీ ప్రభుత్వం పైసా నిధులు కూడా కేటాయించలేదన్నారు. ఇక కేంద్రం ఇచ్చిన వాటిని కూడా దారి మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.4వేల కోట్లతో పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు చేపట్టిందన్నారు. గుర్ల ప్రాంతానికి ఇన్నాళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్నందున తన వల్ల కూడా ఇది జరిగిందని ఒప్పుకోవాలని బొత్స సత్యనారాయణ కు అచ్చెన్నాయుడు హితవు పలికారు.  

Read more RELATED
Recommended to you

Latest news