రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. పెద్దపల్లి జిల్లాలో రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 24 గంటల్లోపు దెబ్బతిన్న ట్రాక్ లను సిద్దం చేసిన అధికారులు….యుద్ద ప్రాతిపాదికన ట్రాక్ పునరుద్దరణ పనులు చేపట్టారు. అప్ లైన్, డౌన్ లైన్ ట్రాక్ ల పై రైళ్లు పరుగులు తీసేందుకు సిద్ధం అయింది. ప్రమాదం ఎలా జరిగిందనే దాని పై అధికారుల దృష్టి పెట్టారు. 12 వ తేదీన రాత్రి పట్టాలు తప్పింది గూడ్స్ రైలు. దీంతో మూడు ట్రాక్ లు…దెబ్బ తిన్నాయి.
ఉత్తర దక్షిణ భారత్ లను కలిపే ప్రధాన మార్గం కావడం తో పదుల సంఖ్యలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగింది. దీంతో ప్రయాణికులు…ఇబ్బంది పడ్డారు. రెండు ట్రాక్ లు సిద్ధం కావడం తో రైళ్ల రాకపోకలు…ప్రారంభం అయ్యాయి. మూడో లైన్ పునరుద్దరణ పనులు పూర్తి చేశారు. ట్రాక్ వేయడం,టెస్టింగ్ సైతం పూర్తి అయింది. ట్రయల్ రన్ పెండింగ్ ఉంది. ట్రయల్ రన్ అయ్యాక ట్రైన్ లను ఆ ట్రాక్ పైకి అనుమతించనున్నారు అధికారులు. ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన రెండు ట్రాక్ ల ద్వారా యధావిధిగా రైళ్ళ రాకపోకలు జరుగుతున్నాయి. గూడ్స్ రైల్ ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ… ఐదుగురు ఉన్నతాధికారులతో విచారణ కమిటీ వేసింది.