ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు చేస్తుండగా.. ఆలయంలోకి ఒకేసారి మూడు ఎలుగుబంట్లు వచ్చాయి. టెంపుల్ ప్రాంగణం నుంచి లోనికి వస్తుండటాన్ని గమనించిన భక్తులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ఎలుగుబంట్లు మాత్రం ఆలయం మొత్తం కలివిడిగా తిరిగినట్లు టెంపుల్లో ఏర్పాటు చేసి సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వాటిని వాటిని బంధించాలని కోరినట్లు తెలిసింది.దీంతో పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంట్ల సంచారంతో భయటకు వచ్చేందుకు కూడా గ్రామస్తులు జంకుతున్నారు.
👉శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హల్చల్..
👉ఒకేసారి శివాలయంలో మూడు ఎలుగుబంట్లు సంచారం
భయంతో పరుగులు తీసిన భక్తులు.
👉చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరుతున్న గ్రామస్తులు. pic.twitter.com/hS5zhiijqq— ChotaNews (@ChotaNewsTelugu) November 15, 2024