సాధారణంగా ఒక వ్యక్తి మనకు ఒకరోజు, రెండు రోజులు కనిపించకుండా పోతే మనం ఆ వ్యక్తి కోసం వెతుకుతుంటాం. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తుంటాం. అయినా ఆచూకి లభించకపోతే చాలా బాధ పడుతూ అదే ఘటనను తలుచుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఓ పన్నెండేళ్ల బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయి దాదాపు 30 ఏళ్ల తరువాత ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల గురించి చెప్పడం వర్ణణాతీతం.
వివరాల్లోకి వెళ్లితే.. కరీంగనర్ జిల్లా వెంకటాయపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద తప్పిపోయాడు మల్లయ్య. నీరు తాగడానికి బయటికి వచ్చి తిరిగి వెళ్లే దారి మరిచిపోయాడు. వరంగల్ లో కూలి పని చేస్తూ.. బాలకార్మిక నిర్మూలన అధికారులకు పట్టుబడ్డాడు. ఆపై పూల వ్యాపారి వద్ద పనికి చేరాడు. పూల కుమార్తెను వివాహం చేసుకున్నాడు. మల్లయ్యకు కొడుకు జన్మించిన తరువాత సొంత గ్రామం వెంకటాయపల్లికి తిరిగి వచ్చాడు. 30 ఏళ్ల తరువాత మల్లయ్య గ్రామానికి తిరిగి రావడంతో గ్రామస్తులంతా చూడటానికి క్యూ కట్టారు. వారి ఇల్లు జనసంద్రంతో నిండిపోయింది. ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందనే చెప్పాలి.