మహారాష్ట్ర బల్లార్ పూర్ బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరాఠీ, హిందీ, తెలుగు భాషలు కలిపి మాట్లాడారు. నా మరాఠీ లో ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి అని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్.. ఈ రెండు రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నాను. శివాజీ మహరాజ్ భూమి ఐన మరాఠా గడ్డ కు నా శిరస్సు వంచి నమస్కరిస్తాను. అయోధ్య రామంమదిరం ప్రతీ అంగుళం మహత్వపూర్ణం చేసారు ఇక్కడి వారు. 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితంగా రాముడికి తన స్ధానం దక్కింది.
మోదీ, అమిత్ షా, హైవే మేన్ ఆప్ ఇండియా నితిన్ గడ్కరీ ల ప్రయత్నాల ఫలితం ఇక్కడి రహదారులను చూస్తే తెలుస్తుంది. ఇక వేయడానికి రోడ్లు లేవనేంతగా రోడ్లు వేసామని చెప్పారు. నేనిక్కడకి ఓట్లు అడగడానికే రాలేదు.. ఈ నేలకు నా గౌరవం తెలపడానికి వచ్చాను. మహారాష్ట్ర అభివృద్ధి కోసం మీ అందరి సహకారం కోరడానికి వచ్చాను. ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలలో ఐదో స్ధానంలో ఉన్నాం.. మూడో స్ధానానికి చేరుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. బాహుబలిలో శివగామి నడక ఆగలేదు మహేంద్ర బాహుబలిని రాజ్యాధికారానికి చేర్చడానికి.. అదే విధంగా ఇక్కడ పది సంవత్సరాల ఎన్డీఏ అధికారం కూడా కొనసాగించాలి. శివసేన, జనసేన ప్రజల రక్షణ కోసం ఏర్పాటైన సేనలు అని పవన్ కళ్యాణ్ తెలిపారు.