సికింద్రాబాద్ బోయిన్పల్లి లో భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నారు అధికారులు. మొత్తం 15 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్టుని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. అయితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి తయారు చేసింది ముఠా. సోనీ గార్లిక్ పేరుతో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను హైదరాబాదులో సరఫరా చేస్తుంది ఆసిమ్. పేస్టులో అల్లంకు బదులు ప్రమాదకరమైన రసానాలు వాడుతుంది ఆసిమ్.
ఇక హైదరాబాదు లోని ప్రముఖ హోటల్స్ కి అల్లం వెల్లుల్లి పేస్టు సరఫరా చేస్తున్న ఆసిమ్.. ప్రతినిత్యం 15 టన్నుల అల్లం వెల్లుల్లి పేస్టుని ప్రముఖ హోటల్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మార్కెట్లో కుళ్ళిపోయిన వెల్లుల్లి తీసుకువచ్చి రసాయనాలు కలిపి పేస్ట్ తయారు చేస్తుంది ఆసిమ్. దాంతో సోనీ గార్లిక్ యజమాని ఆసిమ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు టాస్క్ ఫోర్స్ అధికారులు.