కన్నడ హీరో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం వహించిన మూవీ కాంతార. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో ఈ చిత్రం కేవలం రూ.16కోట్లతో తెరకెక్కింది. 2022లో విడుదలైన కాంతారా అప్పట్లో భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.400 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కాంతార మూవీ కన్నడ సినీ పరిశ్రమలోని చిన్న సినిమాలకు మంచి హైప్ ఇచ్చిందనే చెప్పాలి.
కాంతార కు ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతార చాప్టర్ -1 ఫస్ట్ లుక్ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. తొలిపార్ట్ తరహాలోనే రిషబ్ శెట్టి లుక్, బీజీఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 02న తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, బెంగాళీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.