సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. ఆయన నిర్ణయాన్ని నాలుగు గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల దాడికి గురైన లగచర్ల వాసులు ముఖ్యంగా ఫార్మా కంపెనీలను వ్యతిరేకిస్తుండగా.. ప్రస్తుతం కొడంగల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. ఎస్టీ రైతులపై జరిగిన దాడి గురించి అధ్యయం చేసేందుకు వారు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలోనే కొడంగల్లో ఫార్మా కంపెనీ కావాల్సిందే అంటూ రైతుల పేరిట వినతి పత్రం అందజేస్తూ ఓ కాంగ్రెస్ నాయకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఫార్మా కంపెనీ రావాల్సిందే. కొడంగల్ డెవలప్మెంట్ కావాల్సిందే. అంటూ రైతుల ముసుగులో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడికి కాంగ్రెస్ నాయకుడు, బొంరాస్ పేట మండలం, బొట్లవాని తండా వైస్ ఎంపీపీ దేశ్య నాయక్, అతని అనుచరులు వినతిపత్రం అందజేశారు.అధికారులపై దాడి చేసింది అసలు రైతులే కాదని వారు బుకాయించే యత్నం చేశారు. తాజాగా ఈ వీడియోపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు.