వైసీపీ వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఏపీకి ఉండే పెద్ద అవకాశం సముద్ర తీరం అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. అమరావతి, పోలవరం ఏపీకి రెండు కళ్లు అన్నారు. పోలవరం నిర్మాణ వ్యయం రూ.55కోట్లకు చేరింది. గత ప్రభుత్వం కేవలం 3.08 శాతం పనులను మాత్రమే చేసింది. కక్ష పూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్టును ఆపేశారు.
తమ ప్రభుత్వంలో మోడీ, కేంద్ర మంత్రుల వల్ల నిధులు అందుతున్నాయి. ఇప్పుడు డయాఫ్రం వాల్ నిర్మించాలంటే దాదాపు రూ.990 కోట్లు అవసరమని వెల్లడించారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు చేశామని తెలిపారు. పోలవరమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని తెలిపారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టును పట్టించుకోలేదని తెలిపారు. ఏడు మండలాలు ఏపీకి ఇవ్వకపోతే చాలా నష్టపోతామని కేంద్రానికి చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు.