సినిమా పరిశ్రమలో అందరూ విడాకులు తీసుకుంటుంటే.. క్యారెక్టర్ ఆర్టిస్టు శ్రీకాంత్ అయ్యంగార్ మాత్రం లేటు వయసులో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. శ్రీకాంత్ ఇటీవల జర్నలిస్ట్‌లను బూతులు తిడుతూ చేసిన వ్యాఖ్యలకు జర్నలిస్ట్ సంఘాలు మండిపడగా..శ్రీకాంత్ చివరకు బహిరంగంగా క్షమాపణలు కోరాల్సి వచ్చింది.
తాజాగా ప్రముఖ సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతితో ఏడడుగులు వేస్తారని టాక్ వినిపిస్తోంది. తనకు నటి జ్యోతి ముద్దు పెడుతున్న ఫోటోని షేర్ చేసిన శ్రీకాంత్ పెళ్లిపై హింట్ కూడా ఇచ్చారు. ‘క్రష్ ఆఫ్ మై లైఫ్..మీ దేవుళ్ళు మాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా?’ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీకాంత్ అయ్యంగార్ ఒక్క ఫోటోతో కన్ఫర్మ్ చేసేసారు. ఇంకా పెళ్లి ఒకటే వాయిదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.