మహిళలపై అత్యాచారం చేస్తే.. తాటతీస్తామని హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మహిళలపై అత్యాచార ఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీపం – 2 పధకం అమలు పూర్తిస్ధాయిలో జరుగుతుందని తెలిపారు. అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యోగాల కల్పన ప్రధాన ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని… 3,73,539 మందికి ఉద్యోగకల్పన ధ్యేయంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చే కంపెనీలకుఇన్సెంటివ్ ఎక్కువ ఇస్తామని ప్రకటించారు. మహిళలపై అత్యాచార ఘటనలపై సహించేది లేదని తేల్చి చెప్పారు. పిల్లల తప్పు కూడా ఉండదు… మనమే మానసికంగా సరిదిద్దాలని కోరారు. ఎవరైనా కరుడుగట్టిన నేరస్తులు ఉంటే చర్యలుంటాయని… కరుడుగట్టిన నేరస్ధులు ఉంటే వాళ్ళ తాటతీస్తామని హెచ్చరించారు చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పైన మా ఆలోచన అని… ఓర్వకల్లు ను డ్రోన్ సిటీగా తయారు చేస్తామని తేల్చి చెప్పారు. లా అండ్ ఆర్డర్, ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీ అనుసంధానంతో చేస్తామని ప్రకటించారు బాబు.