ఆ టీచర్ ను అక్కడే ఉరి వేయాలి : కాకినాడ కలెక్టర్

-

కాకినాడ లో విద్యార్థినులను పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్ ను ఉద్దేశించి కలెక్టర్ కీలక కామెంట్స్ చేసారు. బాలికలను లైంగికంగా వేధించే వారిని మరొక దేశంలో ఉరి వేస్తారు. పోక్సో కింద కేసు నమోదు అయిన టీచర్ ను నేను కొట్టలేను కనుక కొట్టలేదు. ఆఫీసర్ ని పెట్టి అక్కడే ఉరి వేయాలి. ఆ టీచర్ ఇంట్లో కూడా అదే వయస్సు పిల్లలు ఉన్నారు..ఆయనకు అదేం ఖర్మ అని అన్నారు. అయితే అలాంటి కీచక టీచర్లను ఫ్యామిలీలో తలెత్తుకోకుండా చేయాలి. కీచక టీచర్ల కోసం తెలిసి మిగిలిన టీచర్లు మనకెందుకులే అని వదిలేస్తున్నారు.

అలా చేస్తే వారు చదువు చెప్పే పిల్లల జీవితాలను చేతులారా నాశనం చేసుకున్నవాళ్ళవుతారు. ఏ టీచరైనా విద్యార్ధులను లైంగికంగా వేధిస్తే ఫొక్సో తో పాటుగా వేరే కేసు పెట్టి లోపలేయిస్తాను. బదిలీల సమయంలో కొందరు టీచర్లు వారి ఇంటి నుండి 10 కి.మీ దూరంలో ఉన్న స్కూల్ కోసం ఎమ్మెల్యే,ఎంపీ సిఫార్స్ లేఖలు తీసుకుని వస్తున్నారు. నాకు చాల షేమ్ అనిపిస్తుంది అని కాకినాడ కలెక్టర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news