తిట్టినంత మాత్రానా పాలన చేసినట్టేనా..? రాణి రుద్రమ సంచలన విమర్శలు

-

అడ్డమైన తిట్లు తిట్టినంత మాత్రానా పరిపాలన చేసినట్టు కాదని.. సీఎం రేవంత్ రెడ్డి పాలన పై దృష్టి పెట్టాలని బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కాంగ్రెస్ మహిళలతో పెట్టిన సభ కాదని.. మహిళలను వంచించి పెట్టిన సభ అని విమర్శించారు.

Rani Rudrama
Rani Rudrama

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహిళల సంక్షేమం పట్ల సోయి లేకుండా పాలించడం సిగ్గు చేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలపై గౌరవం లేదని.. మహిళల రక్షణ పై బాధ్యత లేదన్నారు. రేవంత్ రెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి పని చేయాలన్నారు. ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి పట్ల  ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం పరిపాలన దక్షత అనిపించుకోదని గుర్తెరుగాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news