ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కూటమి సర్కార్. 2024 నుంచి 2025 మధ్య ఆ విద్యా సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఏపీ సర్కార్. అయితే ఈ డబ్బులను విద్యార్థుల ఖాతాల్లో కాకుండా… కాలేజీల ఖాతాలోని వేయనుంది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎస్సి విద్యార్థులకు కేంద్రం నుంచి 60 శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా… మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఏటా మూడు నుంచి నాలుగు విడతల్లో విద్యార్థుల ఖాతాల్లో ఫీజు డబ్బులను… జమ చేసింది వైసిపి సర్కార్. కానీ టిడిపి ప్రభుత్వంలో. మ్.కాలేజీల ఖాతాల్లోకి నేరుగా నిధులు వెళ్ళనున్నాయి.