ఉదయం 5కి లేవాలనుకుని ఫెయిల్ అవుతున్నారా? ఈ ట్రిక్స్ పాటిస్తే సక్సెస్ అవుతారు..

-

పొద్దున్న ఐదింటికి లేవడం కష్టమండీ బాబు, అసలే చలికాలం.. ఇప్పుడు ఇంకా కష్టం అని కంప్లైంట్ చేసే వాళ్లు చాలామంది ఉంటారు. అతి తక్కువ మంది మాత్రమే ఉదయం అయిదింటికి నిద్రలేస్తారు.ఆ తక్కువ మందిలో ఎక్కువమంది సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారంటే మీకు ఖచ్చితంగా ఆశ్చర్యం వేస్తుంది. కానీ అది నిజం.

పొద్దున్నే ఉదయం ఐదింటికి లేచిన వారు తమ తమ రంగాల్లో సక్సెస్ అవుతున్నారని తెలుస్తోంది.

అయితే పొద్దున్న తొందరగా లేవడం అంత ఈజీ కాదు. దీన్ని అలవాటు చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

నెమ్మదిగా అలవాటు చేయండి:

మీకు ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు నిద్ర లేవడం అలవాటుగా ఉంటే.. మరుసటి రోజు నుంచి ఐదింటికి నిద్ర లేవడం చాలా కష్టం అవుతుంది. అందుకే.. రోజూ నిద్రలేచే సమయం కన్నా 15 నిమిషాలు ముందుగా నిద్ర లేవండి. ఈ విధంగా నెమ్మదిగా టైమ్ తగ్గిస్తూ వస్తే మీ బాడీ అలవాటు పడుతుంది.

ఫోన్ వాడకండి:

పొద్దున తొందరగా లేవాలంటే రాత్రి తొందరగా పడుకోవాలి. తొందరగా నిద్ర రాదు కదా ఎలా పడుకోవాలనే ప్రశ్న చాలా మంది వేస్తారు. తొందరగా నిద్ర రావాలంటే పడుకునే గంట ముందు ఫోన్ వాడకూడదు. దానిలోని బ్లూ లైట్ కారణంగా నిద్రకు ఉపక్రమింపచేసే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవ్వక నిద్ర రాదు.

పడుకునే చోటు బాగుండాలి:

తొందరగా నిద్ర రావాలంటే మీరు పడుకునే చోటు కూడా బాగుండాలి. బెడ్ రూంలో నిశ్శబ్దంగా చీకటిగా ఉంటే నిద్ర తొందరగా వస్తుంది. అలా అని పూర్తిగా చీకటిగా ఉండరాదు. తల కింద పెట్టుకునే తలగడ కూడా కరెక్ట్ గా ఉంటే నిద్ర సరిగ్గా పడుతుంది.

మిమ్మల్ని మీరు పొగుడుకోండి:

రోజూ ఉదయాన్నే తొందరగా లేవాలన్న ఉద్దేశంతో.. డైలీ నిద్రలేచే సమయం కన్నా కొంచెం ముందుగా నిద్ర లేస్తున్నప్పుడు.. మిమ్మల్ని మీరు పొగుడుకోండి. అవసరమైతే మీకు మీరు బహుమతి ఇచ్చుకోండి. దీనివల్ల మీలో ఉత్సాహం పెరిగి ఇంకా తొందరగా నిద్ర లేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news