భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ద్రౌపది ముర్ము రానున్నారు. కోటీ దీపోత్సవానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశముంది. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
రాష్ట్రపతి విమానం నుంచి ల్యాండ్ కాగానే వీరంతా రాష్ట్రపతి వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. తొలుత గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేశారు. తరువాత కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాజ్ భవన్ కి చేరుకొని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని.. ఆ తరువాత అక్కడి నుంచి కోటి దీపోత్సవానికి వెళ్లనున్నారు రాష్ట్రపతి. ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్న తరువాత భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటీ దీపోత్సవ కార్యక్రమానికి హాజరు అవుతారు. ఇప్పటివరకు సీఎం, హోంమంత్రులు హాజరయ్యారు. గత ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ ఏడాది కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. తాజాగా దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.