ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిరవదికంగా వాయిదా పడింది. దాదాపు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు సాగారు. 59 గంటల 57 నిమిషాల పాటు సమావేశాలు కొనసాగాయి. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. 21 ప్రభుత్వ బిల్లులకు ఆమోదం తెలిపారు. పీఏసీ చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. మరోవైపు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సమావేశాలను బహిష్కరించింది.
మరోవైపు రాష్ట్ర శాసనమండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్టు చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. మొత్తం 08 బిల్లులను మండలి ఆమోదించింది. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చేసిన చట్టాన్ని మండలి రద్దు చేసింది. అదేవిధంగా లోకాయుక్త సవరణ బిల్లు 2024 కు ఆమోదం పలికింది.