మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఎవరు.. షిండే OR ఫడ్నవిస్ ?

-

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో మహాయుతి కూటమి ఎన్నికల్లో దూసుకుపోతుంది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్డీయే ఎవరిని చేస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏక్‌నాథ్ షిండేను నిలుపుతారా ? లేక బీజేపీ అద్భుత ప్రదర్శనకు నాయకత్వం వహించిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేస్తారా? అనేది ఇక్కడ పెద్ద సమస్య.

Devendra Fadnavis and Eknath Shinde | PTI

288 స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 220 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, మహా వికాస్ అఘాడి 57 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌లో ఫడ్నవీస్ విజయం దిశగా వెళుతుండగా, కోప్రి-పచ్‌పఖాడి నియోజకవర్గంలో ఏకనాథ్ షిండే ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ పోటీ చేసిన 149 స్థానాల్లో 124 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే 83% స్ట్రైక్ రేట్ ను సాధించింది. బీజేపీ ఇంత స్థాయిలో గెలవడానికి కారణం ఫడ్నవీస్. అందుకే అతనికి అవకాశం ఇచ్చే ఛాన్స్‌ ఉంది. లేకపోతే.. ప్రభుత్వాన్ని రెండున్నర ఏళ్ల పాటు విభజించి.. పంచుకునే ఛాన్స్‌ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news