ప్రజాపాలన, విజయోత్సవాలపై సీఎస్, డీజీపీ, అన్ని శాఖల ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దీనికి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు హాజరయ్యారు. ఇక ఈ క్రమంలో కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసారు.
నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని స్పష్టం చేసిన సీఎం.. కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అని రేవంత్ అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానన్న సీఎం.. కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు. అలాగే భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని.. తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో లగచర్ల ఘటన పైన సీఎం కి వినతిపత్రం అందజేసారు వామపక్ష నాయకులు.