రేపటి నుంచి డిసెంబరు 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ తరుణంలోనే “వక్ఫ్ సవరణ బిల్లు-2024”, “ఒక దేశం-ఒకే ఎన్నిక” బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింప చేసుకోవాలనే సంకల్పంతో ఉంది మోడీ ప్రభుత్వం. ప్రస్తుతం, “పార్లమెంటరీ సంయుక్త కమిటీ” “వక్ఫ్ సవరణ బిల్లు-2024” పరిశీలనలో ఉంది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్న బిల్లులు..
1. భారతీయ వాయుయన్ విధేయక్ బిల్లు, 2024
2. విపత్తు నిర్వహణ (సవరణ) బిల్లు, 2024
3. గోవా అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణ బిల్లు, 2024
4. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు, 2024
5. ది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు, 2024
6. రైల్వేస్ (సవరణ) బిల్లు, 2024
7. బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు, 2024
8. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు, 2024
9. వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024
10. చమురు క్షేత్రాల (నియంత్రణ మరియు అభివృద్ధి) సవరణ బిల్లు, 2024
11. బాయిలర్స్ బిల్లు, 2024
12. రాష్ట్రీయ సహకారి విశ్వవిద్యాలయ బిల్లు, 2024
13. పంజాబ్ కోర్టుల (సవరణ) బిల్లు, 2024
14. మర్చంట్ షిప్పింగ్ బిల్లు, 2024
15. కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024
16. ఇండియన్ పోర్ట్స్ బిల్లు, 2024