ఐపీఎల్ సీజన్ 2025 ఆక్షన్ జరుగుతోంది. ఇవాళ జరిగిన వేలంలో రిషబ్ పంత్ రికార్డులను బ్రేక్ చేశారు. అంతకు ముందు శ్రేయాస్ అయ్యర్ రికార్డు కొల్లగొడితే.. అతని రికార్డును సైతం రిషబ్ బ్రేక్ చేయడం విశేషం. వాస్తవానికి వేలానికి ముందే రిషబ్ రికార్డులు క్రియేట్ చేస్తాడని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే రిషబ్ పంత్ అదరగొట్టారు. ఈ యువ సంచలనాన్ని రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది. RTM పద్దతిలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకునేందుకు ప్రయత్నించినా లక్నో తగ్గలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్ అత్యధిక ధర కావడం విశేషం. ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్ ని రూ.26.75 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది. మరోవైపు పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను రూ.11.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. గత ఏడాది రూ.24.75 కోట్లకు రికార్డు ధరకు కోల్ కతా కొనుగోలు చేసింది. కానీ ఈ ఏడాది సగానికి సగం ధరకు కూడా అమ్ముడుపోకపోవడం గమనార్హం. మరోవైపు జోస్ బట్లర్ ను గుజరాత్ టైటాన్స్ రూ.15.75 కోట్లకు సొంతం చేసుకుంది.