శ్రీ శైలం మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

-

ఏపీలోని నంద్యాల జిల్లా శ్రీ శైలంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మల్లికార్జున స్వామి దర్శనానికి సుమారు 6 గంటల టైం పడుతున్నట్లు తెలుస్తోంది. చివరి కార్తీక సోమవారం అవడంతో వేకువ జాము నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం వద్ద పలుచోట్ల భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా క్యూ లైన్లలో వేచిఉన్న భక్తులకు పాలు, ప్రసాదాలు అందచేస్తున్నారు. రద్దీ దృష్ట్యా ఇప్పటికే శని,ఆది,సోమవారాల్లో సర్వ దర్శనం, సామూహిక, గర్భాలయ అభిషేకాలను ఆలయ అధికారులు నిలిపివేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news