తెలంగాణ నిరుద్యోగులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. గ్రూప్ 2 పరీక్షలపై తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన ప్రకటన చేసింది. యధాతధంగా గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయని ప్రకటన చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. వచ్చే నెల 15 అలాగే 16వ తేదీల్లో… జరిగే గ్రూప్ 2 పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండబోదని అధికారులు కూడా క్లారిటీ ఇచ్చేశారు.
గ్రూప్ 2 పరీక్షలు వేదావిధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని.. ఇందులో ఇలాంటి అపనమ్మకాలు లేవు అని… తేల్చి చెప్పారు. డిసెంబర్ 16వ తేదీన RRB పరీక్షను… తెలంగాణ రాష్ట్రం నుంచి డిప్లమా అలాగే ఐటిఐ అర్హత ఉన్నవారు.. మాత్రమే రాస్తున్నారని అధికారులు తెలిపారు. ఇందులో 6300 మంది అభ్యర్థులు మాత్రమే ఉండాలని క్లారిటీ ఇచ్చారు. దానివల్ల గ్రూప్ టు పరీక్షకు ఎలాంటి ఆటంకం…ఉండబోదని స్పష్టం చేశారు. కచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. అనవసరంగా రాద్ధాంతం చేయకూడదని…వెల్లడించారు అధికారులు. దీంతో తెలంగాణ అభ్యర్థులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.