2029 నాటికి రాష్ట్రంలో రూ.5లక్షల ఐటీ వర్క్స్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో నైపుణ్యాభివృద్ధి కోసం డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మిస్తామని చెప్పారు. స్టార్టప్ లకు రూ.25లక్షల సీడ్ ఫండింగ్ ఇచ్చేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. అదేవిధ:గా యూత్ లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తామని తెలిపారు. మరిన్ని ఐటి పాలసీలపై చర్చిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు.
మరోవైపు గత ఐదేళ్లు మరిచిపోదామనుకున్నా.. అందరికీ గుర్తుకు ఉండాలని నాలుగో సారి సీఎం అయినా ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైన వ్యవస్థను కాపాడటం కష్టంగా ఉన్నదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రాథమిక హక్కులు కాలరాశారని.. విమర్శించారు. రాజ్యాగంలో జరిగిన తప్పిదాల వల్ల కొన్ని దశాబ్దాలు ఇబ్బంది పడతామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాసిన రాజ్యాంగం భారత్ ది అని పేర్కొన్నారు.