రాష్ట్రంలో కూటమి నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అయితే తాజాగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘లా అండ్ ఆర్డర్’ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏ మాత్రం సహించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. కూటమిలో భాగస్వాములు గా ఉన్న పార్టీల నేతలు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
తాజాగా ఆర్టీపీపీ బూడిద తరలింపు వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి , టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన పై ఇద్దరు నేతలు వెనక్కి తగ్గకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ వివాదం పై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్పిస్తే సహించను. ఈ ఘటనపై అధికారులు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు.