ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

-

తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలో వరుసగా ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది గులాబీ పార్టీ.ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే… వారం రోజులు కార్యక్రమాలు చేపట్టనుంది.ఈ నెల 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించబోతోంది.

BRS

 

గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలు. గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరపున అధ్యయన కమిటీ ఏర్పాటు చేయబోతోంది.

 

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ ఏర్పాటు కానుంది. కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది.. అనంతరం ఈ నివేదిక అంశాలను శాసనసభలో లేవనెత్తనుంది బీఆర్ఎస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news