వైరల్ వీడియో; మహిళా అధికారి, అహంకారం చూడండి…!

-

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తనిఖీ నిమిత్తం వెళ్ళిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం) ప్రియాంక తలానియా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. రాజస్థాన్ రాష్ట్రంలోని హనుమన్‌ ఘర్ లోని పిలిబంగా ఎస్‌డిఎమ్ ప్రియాంక తలానియా ఉన్నపళంగా తనిఖీ చేయడానికి వెళ్ళారు.

తనిఖీ కోసం జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు వెళ్లినప్పుడు, ఆమె కొన్ని పత్రాలను తనిఖీ చేయాలనుకుంటున్నందున తన కుర్చీలోంచి లేవాలని ఆన్-డ్యూటీ డాక్టర్ నరేంద్ర బిష్ణోయిని ఆదేశించారు. OP వద్ద రోగులకు హాజరవుతున్న౦దున డాక్టర్, కుర్చీని ఖాళీ చేయడానికి మర్యాదగా నిరాకరించారు. ఆమె మరేదైనా కుర్చీ మీద కూర్చోవచ్చని అతను సూచించాడు. అయినా సరే ఆమె వెనక్కు తగ్గలేదు.

వేరే కుర్చీలో కూర్చోకుండా ఆమె వైద్యుడిపై అరవడం మొదలుపెట్టింది. బూతులు తిట్టడం కూడా మొదలుపెట్టింది ప్రియాంక. ఈ వ్యవహారం అంతా కూడా అక్కడ ఉన్న కొందరు రికార్డ్ చేసారు. ఈ వీడియోను డాక్టర్ మనీష్ కుమార్ ట్విట్టర్లో పోస్ట్ చేసారు. “ఆమె ఎస్.డి.ఎమ్, సి.హెచ్.సి ఆకస్మిక తనిఖీ కోసం వెళ్ళింది. తన సీటును ఖాళీ చేయమని డ్యూటీ ఇన్‌చార్జిని కోరగా అతను మర్యాదగా మరియు కఠినంగా నిరాకరించాడని పోస్ట్ చేసారు.

2 నిమిషాల నిడివి గల వీడియోలో, ఎస్‌డిఎమ్ తన అధికారంతో వైద్యుడిని బెదిరించడం కనిపిస్తుంది. డాక్టర్ ప్రశాంతంగా ఉన్నా సరే ఆమె అతడ్ని రెచ్చగొడుతూ ఉంటుంది. మీరు కొత్తగా విధుల్లో చేరారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా…? నా పరిధిలోని కార్యాలయాలను పర్యవేక్షించే అధికారం నాకు ఉందని మీకు తెలుసా…? తెలుసా అంటూ ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news