మహారాష్ట్రలో డిసెంబర్ 5న మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. గతంలో రెండు సార్లు సీఎంగా, ఒకసారి డిప్యూటీ సీఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. ఇప్పుడు మరోసారి సీఎం రేసులో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఆయనే మహారాష్ట్ర తదుపరి సీఎంగా బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత తెలిపారు.
దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు డిసెంబర్ 2న బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసేందుకు సమావేశం నిర్వహిస్తామన్నారు. కాగా, సీఎంగా ఎవరు ఉండాలనేదానిపై బీజేపీ తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తామని అపద్ధర్మ సీఎం ఏక్ నాథ్ షిండో, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం తెలిపారు.