మీదీ మిడిల్ క్లాస్ ఏనా..? అయితే వెంటనే ఇలా మీ డబ్బుని ఆదా చేయండి..!

-

మీది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. చాలామంది ఈరోజుల్లో డబ్బుని పొదుపు చేసుకోవట్లేదు. వచ్చిన డబ్బుని ఖర్చు చేసేస్తూ ఉంటారు. డబ్బులు ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. డబ్బులు ఆదా చేసుకుంటేనే భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండదు. మీరు కొత్తగా పొదుపు చేయాలనుకుంటున్నారా? అయితే ఆర్థిక నిపుణులు చెప్పే కొన్ని సూచనలను పక్కా పాటించండి. పొదుపు చేయాలనుకుంటే మొదట వచ్చే జీతాన్ని ఎందుకు ఎంత ఖర్చు చేయాలనే దాని గురించి అవగాహన రావాలి. వీటిపై మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంట్లో నిత్యవసరాల కోసం వాడే డబ్బుని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ప్రతిరోజు అవసరమయ్యే వాటి కోసం ఎంత ఖర్చు చేయాలనే దాని గురించి కూడా రాసుకోండి.

ఏ చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం లేకుండా ఒక దగ్గర రాసుకుంటే ఖచ్చితంగా మీరు ఎలా సేవ్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి అనేది కూడా అర్థమవుతుంది. పైగా క్లారిటీ ఉంటుంది. డబ్బు ఎటు పోయింది అనేది కూడా మీకు తెలుస్తుంది. బడ్జెట్ అనేది చాలా పెద్ద పదం అని చాలా మంది అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరికి కూడా బడ్జెట్ చాలా ముఖ్యం ఎప్పుడూ కూడా బడ్జెట్ కి మించి ఖర్చులు చేయకుండా చూసుకోవాలి. బడ్జెట్ లో కారు, బండి తో పాటుగా అత్యవసరాల కోసం కొంత కేటాయించుకోండి. మీ ఆదాయంలో పది నుంచి 15% పొదుపు ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఖర్చులు ఎక్కువగా ఉంటే పొదుపు చేయలేరు.

సరదాలకి, విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేయడం మంచిది కాదు. పొదుపు చేయాలనుకుంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి దీర్ఘకాలిక లక్ష్యాలు, స్వల్పకాలిక లక్ష్యాలుగా వాటిని విభజించుకోండి. సరదాలు, వెకేషన్స్ వంటివి స్వల్పకాలిక లక్ష్యాలు అలాగే సొంత ఇల్లు, పిల్లల చదువు ఇటువంటివి దీర్ఘకాలిక లక్ష్యాలు. సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే నెలనెలా కొంచెం డబ్బుని పొదుపు చేసుకోవాలి. మీ సేవింగ్స్ ని బట్టి ఖర్చులు చూసుకోవాలి ఎప్పుడూ కూడా రిస్క్ లో పడకండి ఆచి తూచి వ్యవహరించండి. ఇలా మీరు ఫాలో అయినట్లయితే అనుకున్నది చేయడానికి అవుతుంది. అలాగే డబ్బుని ఆదా చేసుకోవడానికి కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news