ఏపీఐఐసీ కార్యాలయానికి చేరుకున్నారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ శాంత కుమారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా సమావేశం జరగనుంది. విభజన చట్టంలోని 9.10 షెడ్యూలు సంస్థల ఆస్తుల పంపకాలపై చర్చించనున్న సీఎస్ ల కమిటీ.. విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల పరస్పర మార్పిడి , వృత్తి పన్ను పంపకం పై చర్చించనున్నారు. ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపైనా అధికారుల కమిటీలో చర్చ జరగనుంది.షెడ్యూలు 9,10 లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో పంపకం కాకుండా మిగిలిపోయిన 8 వేల కోట్ల అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇందులో తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారితో పాటుగా ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తాలు హాజరు అవుతున్నారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ నుంచి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ , ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ , సాధారణ పరిపాలన శాఖ సురేశ్ కుమార్, బాబు ఏ హాజరు అవుతున్నారు.