పెళ్లి పీటలెక్కబోతున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?

-

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే చాలామంది క్రికెటర్లు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్లు ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా… భారత స్టార్ బ్యాట్మెంటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతున్నారట పీవీ సింధు.

PV Sindhu Getting Married In Udaipur On Dec 22

హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే బిజినెస్ మాన్ తో ఏడు అడుగులు వేయనున్నారట పీవీ సింధు. ఇక ఈనెల 22వ తేదీన.. పీవీ సింధు వివాహం జరగబోతుందని సమాచారం అందుతుంది. ఉదయపూర్ లో గ్రాండ్గా పీవీ సింధు వివాహం జరగనుందట. ఇక ఈనెల 24వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారట. ఇక పెళ్ళికొడుకు వెంకట సాయి దత్త, పీవీ సింధు కుటుంబానికి ఎప్పటినుంచో అనుబంధం ఉందట. అందుకే వీరిద్దరికీ వివాహం చేయబోతున్నారట. దీంతో ఇద్దరి ఇంట్లో.. పెళ్లి పనులు షురూ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news