మాకు రుణమాఫీ, రైతుబంధు రాలే.. పెన్షన్ కూడా రాలే!

-

సీఎం రేవంత్ ప్రభుత్వంలో తమకు రుణమాఫీ కాలేదని.. రైతుబంధు రాలేదని సామాన్య ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి లబ్ది పొందిన వారు సపోర్టు ఇస్తుండగా..లబ్ది పొందని వారు కాంగ్రెస్ సర్కారు తీరును తప్పుబడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచోడు ఎవ్వరూ ఓట్లు వేయరని.. శరం తప్పినోళ్లే వేస్తారని ఓ పెన్షన్ దారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారని, మాకు పెన్షన్ రూ.4వేలు చేస్తానని చెప్పి మోసం చేశారన్నారు. కేసీఆర్ హయాంలో తమకు పెన్షన్ వచ్చిందని, ఆయన పెంచాడని.. రేవంత్ రెడ్డి సర్కార్ మాటలకే పరిమితం అయ్యిందని, ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చడం లేదన్నారు. రుణమాఫీ కొందరికి అయ్యిందని, మరికొందరికి కాలేన్నారు. బోనస్ కూడా వారికి అనుకూలంగా ఉన్నవారికే ఇచ్చారని, అందరికీ రాలేదని విమర్శించారు. కాగా, ఆ పెన్షన్ దారుడుకి ఏ ప్రాంతానికి చెందిన వాడో తెలియాల్సి ఉంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news