Pushpa 2: ఆన్‏లైన్‏లో ‘పుష్ప-2’ మూవీ లీక్!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-రష్మిక మందన్నా జంటగా నటించిన ‘పుష్ప-2’మూవీకి భారీ షాక్ తగిలింది. ఆన్‌లైన్‌లో ‘పుష్ప-2’ ఫుల్ సినిమా ప్రత్యేక్షమైనట్లు తెలుస్తోంది. తమిళ్ రాకర్స్, టెలిగ్రాం, మూవీ రూల్స్ లాంటి ప్లాట్ ఫామ్స్‌లో మూవీ హెచ్ డీ ప్రింట్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

pushpa 2, allu arjun, pushpa 2 leak

ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందించాల్సి ఉంది. మరో వైపు థియేటర్లు పుష్పరాజ్ సౌండ్‌తో మోతెక్కిపోతున్నాయి. కాగా, ఈ క్రమంలోనే ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు వెళ్లి నిన్న రాత్రి ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూశారు. అయితే, ‘జాతర’ సీన్‌లో ఐకాన్ స్టార్ నటన చూసి ఫ్యాన్స్ అంతా నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అది చూసిన బన్నీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ.. మనం విజయం సాధించాం అంటూ అభివాదం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news