ఏపీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ షాక్..ఇక ఇప్పట్లో లేనట్లే కొత్త రేషన్ కార్డులు వచ్చేలాగా కనిపించడం లేదు. మొన్నటికి మొన్న అయితే.. సంక్రాంతికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఏపీ సర్కార్ పదే పదే చెప్పిందని అంటున్నారు.
ఇందులో భాగంగానే.. డిసెంబర్ 2 వ తేదీ నుంచి.. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు అప్లికేషన్లు తీసుకుంటామని కూడా ప్రకటించారని అధికారులు. కానీ డిసెంబర్ 6వ తేదీ వచ్చినా… కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారుల అప్లికేషన్లపై ఎలాంటి ప్రకటన రాలేదని ప్రజలు అంటున్నారు. అసలు పట్టించుకునే నాధుడే లేడన్నట్లు వ్యవహరిస్తున్నారు.
ఇక అటు ఆంధ్రప్రదేశ్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో ఉచిత బస్సుపై కసరత్తులు చేస్తోందట నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు పథకాన్ని ఏపీలో అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.