రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా మరోసారి రంగంలోకి దిగింది. మొన్నటివరకు కాస్త సైలెంట్ అయిన హైడ్రా తాజాగా మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేస్తోంది. కొన్ని ప్రభుత్వ స్థలాలు, చెరువు భూముల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అధికారులకు ఫిర్యాదులు రావడంతో శుక్రవారం ఉదయం కూల్చివేత చర్యలు కొనసాగుతున్నాయి.
అక్రమంగా ఖాళీ స్థలంలో నిర్మించిన హద్దు గోడలను జేసీబీ సాయంతో కూల్చివేస్తున్నారు. ఇదిలాఉండగా, నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిన తమకు ఫిర్యాదు చేస్తే దాన్నిపరిశీలించాక చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల ప్రకటించడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.