ఒక్కో పార్టీకి కొన్ని సిద్దాంతాలు ఉంటాయి.. వాటికి లోబడి పనిచేసే వారికే అవకాశాలు వస్తుంటాయి.. బిజపీకి కూడా క్రమశిక్షణ, నిబద్దత కల్గిన సిద్దాంతాలుంటాయి.. వీటికి కట్టుబడి పార్టీకోసం పనిచేసేవారికి విసృతమైన అవకాశాలు వస్తుంటాయి.. వారిలో మహారాష్టీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు.. తలపండిన రాజకీయ ఉద్దండులు ఉన్న మహారాస్టలో బిజేపీ తీసుకొచ్చిన రాజకీయ యువకిరణం దేవంద్ర పఢ్నవీస్..
2014లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. ప్రధాని మోడీ, అమిత్ షా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.. ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని సమర్దవంతంగా నడిపారు.. ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు.. రాష్టమంత్రిగా కూడా అనుభవం లేని ఫడ్నవీస్ కు సీఎం పదవి ఇవ్వడం అప్పట్లో రాజకీయవర్గాల్లో సంచలనం కల్గించింది.. కానీ ప్రస్తుతం ఫడ్నవీస్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు..
వార్డు కన్వీనర్ స్థాయి నుంచి రెండు సార్లు సీఎంగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్.. మరోసారి సీఎం పదవిని స్వీకరించారు.. 1989లో ఏబీవీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ఆయన ప్రారంభించారు. 22 సంవత్సరాల వయస్సులో నాగ్ పూర్ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు.. 1997లో 27 ఏళ్లకు నాగ్ పూర్ మేయర్ పదవి చేపట్టారు.. దేశంలో చిన్న వయస్సులో మేయర్ పదవి చేపట్టి రికార్డు సౄష్టించారు..
అప్పటి నుంచి బిజేపీ ఆయనకు అవకాశాలు ఇస్తూ వచ్చింది.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. 1999లో నాగ్ పూర్ నైరుతి నియోకజవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం వెనక్కి తిరిగి చూడలేదు.. ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.. ఈ క్రమంలోనే మోడీకి, అమిత్ షాకి దగ్గరై.. అత్యంత నమ్మకస్తులుగా మారారు.. అనంతరం 2014లో 44వ ఏట సీఎంగా పదవి చేపట్టారు..
ఆయన హార్ట్ వర్క్, కమిట్మెంట్ తోనే మోడీ దృష్టిని ఆకర్షించారు. దీంతో కేంద్ర నాయకత్వం ఆయనకు మంచి అవకాశాలు ఇస్తూ వచ్చింది.. గోవా, కేరళ, బిహార్, ఉత్తరాఖండ్ లో జరిగిన ఎన్నికలకు బిజేపీ ఇన్చార్జిగా కూడా పనిచేశారు. 2014,2019లో బిజేపీ విజయానికి ఫడ్నవీస్ పనితనం కూడా ఓ కారణం.. దాని తర్వాత మహారాష్టలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2022లో సీఎం పదవిని త్యాగం చేశారు.
2024లో మహారాష్టలో బిజేపీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది.. టార్గెట్ 2029 అన్నట్లుగా ఫడ్నవీస్ పనిచేశారు.. పార్టీని మరింత బలోపేతం చేశారు.. మహాయుతి కూటమితో కలిసి ఎన్నికలకు వెళ్లారు.. ఆయన వ్యూహాలతో ప్రత్యర్ది పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేశారు.. వికాస్ అఘాడియా కూటమిని చిత్తు చేసి.. బిజేపీని బలమైన శక్తిగా నిలిపారు. ఈ క్రమంలోనే మరోసారి ఫడ్నవీస్ ను సీఎం పదవి వరించింది..