KCR: అంబేద్కర్ పై తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన అంబేద్కర్ గారి అజరామర కీర్తిని ప్రపంచానికి చాటేందుకు నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు.
ఆనేక విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించిన కేసీఆర్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలను , అనితర సాధ్యమైన కృషిని బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు.