రేపు వైటీపీఎస్ ప్రారంభం.. ఇదీ కేసీఆర్ దార్శనికత : కేటీఆర్

-

నల్గొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) రేపు ప్రారంభం కానుంది. ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం వెనక ఉన్న కేసీఆర్ దార్శనికత, కృషి తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుంటుందని.. ‘ఇదీ కేసీఆర్ ఆనవాలని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. 2014లో కేవలం 7,778 మెగావాట్ల కెపాసిటీ మాత్రమే ఉండగా, గత బీఆర్ఎస్ సర్కార్ 20,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మాణం చేపట్టిందన్నారు.

‘ఇది దేశ చరిత్రలో ఎన్నడూ చూడని విజయగాథ! అని, తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని మరో సంతకమని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కే‌సి‌ఆర్ దీర్ఘ దృష్టికి, భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో అనితరసాధ్యమైన వేగానికి మరొక ఉదాహరణ అన్నారు.వైటీపీఎస్ పూర్తి సామర్థ్యం 4000 మెగావాట్లు (5×800) అని, స్వతంత్య్ర భారత చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఇదేనని కేటీఆర్ రాసుకొచ్చారు.
వైటీపీఎస్ నిర్మాణాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం బీహెచ్ఈఎల్‌కు అప్పగించిందని గుర్తుచేశారు. దీని విలువ దాదాపు రూ.20,400 కోట్లు ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news