ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి ఉద్యోగులకు పూర్తిస్థాయి గ్రాట్యూటీ చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీంతో ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఉద్యోగ సంఘాల వినతి మేరకు గ్రాట్యూటీ పై 16 లక్షల సీలింగ్ ఎత్తివేయడం జరిగింది.
ఇప్పటికే తక్కువ మొత్తం పొందిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని కూడా వివరించింది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ. బకాయిల కోసం ఆర్టీసీ ఉద్యోగులు వెంటనే డిపోలో దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచనలు చేయడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.