Minister Ponnam Prabhakar to KCR Farmhouse today: ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నేడు మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో భేటీ కానున్నారు. డిసెంబర్ 9న తెలంగాణ విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరింది తెలంగాణ సీఎంఓ.
దీంతో కేసీఆర్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కు అపాయింట్‌మెంట్ ఇచ్చారని సమాచారం. ఈ తరునంలోనే.. మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో భేటీ కానున్నారు. కాగా, డిసెంబర్ 9న తెలంగాణ విగ్రహా విష్కరణకు శ్రీకారం చుట్టనుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమానికి ఢీల్లీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం రావడం లేదట.