అనసూయ దెబ్బకు… కడప జిల్లాలో ఆర్టీసీ బస్టాండ్ మూసి వేశారు ఆర్టీసీ అధికారులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ ను మూసేశారు ఆర్టీసీ అధికారులు. కడప జిల్లా మైదుకూరు బట్టల దుకాణం ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమానికి యాంకర్ అనసూయ వస్తున్నారట. కడప జిల్లా మైదుకూరు బట్టల దుకాణం ప్రారంభోత్సవం సందర్బంగా అనసూయ వస్తుండటంతో ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ ద్వారం మూసేశారు ఆర్టీసీ అధికారులు.
అయితే.. ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ ద్వారం మూసివేయడంతో… అవస్థలు పడుతున్నారు ప్రయాణికులు విద్యార్థులు. ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులను ఆపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఆర్టీసీ బస్సు స్టాండ్ లో ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తే జరిమానా విధించే అధికారులు దుకాణాలను ఏర్పాటు చేపించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైదుకూరు ఆర్టీసీ అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.