ఇడ్లీలో దర్శనమిచ్చిన జెర్రీ.. అధికారులకు కీలక విజ్ఞప్తి!

-

తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న దాడుల్లో ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న ముఠాల గుట్టు రట్టవుతోంది. ఇటీవల నగరంలో పెద్ద ఎత్తున నకిలీ అల్లంవెల్లుల్లి పేస్టును తయారు చేస్తున్న అక్రమార్కులను అరెస్టు చేశారు. అయితే, ఓవైపు కల్తీ, మరోవైపు కలుషిత ఆహారానికి సంబంధించి అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో ప్రతిరోజూ ఏదో చోట ఆహారంలో పురుగులు, బొద్దింకలు వంటివి చూస్తునే ఉన్నాం. నిన్న బావర్చి బిర్యానీలో ఓ కస్టమర్‌కు టాబ్లెట్ కవర్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్ బస్టాండ్ ఎదురు గల ఓ హోటల్లో సాంబార్ ఇడ్లీ తింటున్న ఒక వ్యక్తి కి జెర్రీ దర్శనం ఇచ్చింది. ఏకంగా జెర్రీ మొత్తాన్ని ఇడ్లీలో ఉడికించారు. దీంతో కంగుతున్న కస్టమర్ సేఫ్టీ మెయింటెయిన్ చేయని ఈ హోటల్‌ని తక్షణమే బంద్ చేయాలని వీడియో సందేశంలో ఆ వ్యక్తి కోరాడు. ఇలాంటి హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news