చంద్రబాబు కూడా అదానీకి అమ్ముడు పోయారు – షర్మిల

-

చంద్రబాబు కూడా అదానీకి అమ్ముడు పోయారు అంటూ ఆరోపణలు చేశారు షర్మిల. రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషమని… మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడ ? అంటూ నిలదీశారు. TDP ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. టెండర్లు లేకుండా అదానీకి కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

ys sharmila on chandrababu palana

మరి ఇప్పుడేమైంది చంద్రబాబు గారు? అన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని, అధికారం దగ్గర పెట్టుకొని, మౌనంగా ఎందుకు ఉన్నారు సార్ చంద్రబాబు ? అంటే ఆనాడు జగన్ గారు అదానీకి అమ్ముడు పోయారు. ఇప్పుడు మీరు అమ్ముడు పోయారు అనే కదా అర్థం అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. మిమ్మల్ని కూడా తక్కెడలో అదానీ నిలబెట్టారు అనే కదా అర్థం అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అదానీ మిమ్మల్ని కొనకపోతే, అదానీ ఒప్పందాలపై ప్రతిపక్షంలో చేసింది నిజమైన ఉద్యమం అయితే, వెంటనే ACB ని మీ పంజరం నుంచి విడుదల చేయండి అంటూ డిమాండ్‌ చేశారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించండి. తక్షణం అదానీతో చేసుకున్న సోలార్ పవర్ డీల్ ను రద్దు చేయండన్నారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news