తెలంగాణ, ఏపీకి మరో రెండు రోజులు వర్షాలు..హైదరాబాద్‌ కు కుండపోత !

-

తెలంగాణ, ఏపీకి మరో రెండు రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటు హైదరాబాద్‌ కు కుండపోత వర్షాలు పడనున్నాయని తెలిపింది. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లో చిరు జల్లులు ప్రారంభం అయ్యాయి. దీంతో.. రోడ్లన్నీ జలయమం అయ్యాయి. ఇక ఇవాళ , రేపు కూడా హైదరాబాద్ లో వర్షాలు పడనున్నాయట. అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలోనూ వర్షాలు ఉన్నాయట.

Meteorological department has announced that Telangana and AP will have rains for two more days

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. ఇవాళ తీవ్ర అల్పపీడనంగా నూ ఆ తర్వాత వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందట. పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగుతూ డిసెంబర్ 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాలకు చేరుకునే అవకాశం ఉందట. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news