ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు!

-

ఎనిమిదేళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని లక్ష్మణ్ చందాలోని ఓ గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేశాడు. శనివారం చిన్నారి ఇంటి వద్ద ఆడుకుంటుండగా బొమ్మేన సాగర్(36) ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం.

అనంతరం చిన్నారి ఏడుస్తూ ఇంటికి వెళ్లి తల్లికి చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news